NLG: ఆలేరు మండలం మందనపల్లి ప్రాథమిక పాఠశాలలో అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా సోమవారం విద్యార్థులకు చిత్రలేఖనం పోటీ నిర్వహించారు. పిల్లలలో దాగి ఉన్న నైపుణ్యాలను వెలికితీయడానికి, చిత్రలేఖనం పట్ల విద్యార్థులకు అభిరుచిని పెంపొందించడానికి ఈ పోటీలను నిర్వహించడం జరిగిందని పాఠశాల హెచ్ఎం ఎండీ సయ్యద్ తెలిపారు.