Viral Video: ఇంగ్లీష్‌లో ఇరగదీసిన ఆటోడ్రైవర్.. వైరలవుతున్న వీడియో
సోషల్ మీడియాలో రోజూ ఏదో ఒక వీడియో వైరల్ అవుతూనే ఉంటుంది. మహారాష్ట్రలో ఓ ఆటో డ్రైవర్ ఇంగ్లీష్‌లో స్పష్టంగా మాట్లాడారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
Viral Video: రోజూ సోషల్ మీడియాలో ఏదో ఒక వీడియో వైరల్ అవుతూనే ఉంటుంది. పాట పాడిన వీడియో లేదా డ్యాన్స్ వేసిన వీడియో ఇలా ఏదో ఒక టాలెంట్‌తో కనిపిస్తారు. అయితే ఓ ఆటోడ్రైవర్ ఇంగ్లీష్‌లో మాట్లాడిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. మహారాష్ట్రలోని అమరావతికి చెందిన ఓ ఆటోడ్రైవర్ ఇంగ్లీషులో మాట్లాడమని సలహా ఇచ్చారు. ఇద్దరు యువకులకు ఇంగ్లీష్ ప్రాముఖ్యతను వివరించారు. ఒక యువకుడు రిక్షాలో కూర్చొని ఉండగా, మరో యువకుడు వీడియోను చిత్రీకరించాడు.
ఆటోడ్రైవర్ ఇంగ్లీష్‌లో మాట్లాడటం చూస్తుంటే ఆశ్చర్యమేస్తుంది. అంత స్పష్టంగా ఆంగ్లం మాట్లాడుతున్నారు. ఇంగ్లీష్ వస్తే లండన్, పారిస్, వెళ్లగలరని ఆటోడ్రైవర్ తెలిపారు. అతని స్పష్టమైన ఇంగ్లీష్ చూసి నెటిజన్లు కూడా షాక్ అయ్యారు. 16 సంవత్సరాలు చదువుకున్న వాళ్ల కంటే ఇంగ్లీష్ బాగా మాట్లాడుతున్నారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.