AKP: చెత్తతో సేంద్రియ ఎరువులను తయారు చేయడం ద్వారా పంచాయతీలకు ఆదాయం సమకూర్చుకోవచ్చునని కోటవురట్ల ఎంపీడీవో చంద్రశేఖర్ అన్నారు. బుధవారం ఉదయం బీకే పల్లిలో శానిటేషన్ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. గ్రామాల్లో సేకరించిన చెత్తను సంపద కేంద్రాలకు తరలించాలన్నారు. సంపద కేంద్రాల్లో చెత్తను సేంద్రియ ఎరువుగా తయారుచేస్తే పంచాయతీలకు ఆదాయం వస్తుందన్నారు.