»Ktr Satires Saying That There Have Been Big Changes In Congress Rule
KTR: మార్పు కావాలి.. కాంగ్రెస్ రావాలి అంటూ పెద్ద మార్పు తెచ్చారు.. కేటీఆర్ సెటైర్
మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అనే నినాదంతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం తెలంగాణలో పెద్ద మార్పునే తీసుకొచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. నాటి కాంగ్రెస్ పాలనలో హాస్లళ్లలో విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారో, ఇప్పుడు అదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారని సోషల్ మీడియా వేదికగా సెటైర్లు విసిరారు.
KTR satires saying that there have been big changes in Congress rule
KTR: మార్పు కావాలి.. కాంగ్రెస్ రావాలంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వాళ్లు తెలంగాణ రాష్ట్రంలో పెద్ద మార్పే తీసుకొచ్చారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పాలన నాటికి నేటికి ఏం మారలేదని కేటీఆర్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. జేఎన్టీయూ మెస్ చట్నీలో వచ్చిన చిట్టెలుక వీడియో క్లిప్‌ను జతచేసి కాంగ్రెస్ పాలనపై విమర్శలు గుప్పించారు. ఆనాటి కాంగ్రెస్ పాలనలో ప్రభుత్వ హాస్టళ్లు ఎలా ఉండేవి.. పురుగుల అన్నం, నీళ్ల చారు.. ఈనాటి కాంగ్రెస్ పాలనలో ప్రభుత్వ హాస్టళ్ల పరిస్థతి ఇంకా అధ్వాన్న స్థితిలో ఉందని రాసుకొచ్చారు. బల్లిపడిన టిఫిన్లు, చిట్టెలుకలు తిరిగే చట్నీలు అంటూ విమర్శించారు.
ఇంకా ఆయన ప్రస్తావిస్తూ.. మొన్నటికి మొన్న భువనగిరి సాంఘిక సంక్షేమ పాఠశాలలో కలుషిత ఆహారం తిన్న విద్యార్థి జీవితం విషాదంగా ముగిసిందని, నిన్న కోమటిపల్లి హాస్టల్లో బల్లి పడిన ఉప్మా తిని 20 మంది విద్యార్థులు వాంతులు చేసుకొని ఆసుపత్రిలో చికిత్సపొందుతున్నారని గుర్తు చేశారు. అలాగే సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్ జేఎన్టీయూ హాస్టల్లో చట్నీలో చిట్టెలుక కనిపించడం చూడాడానికి జుగుప్సకరంగా ఉందన్నారు. ఇలాంటి ఆహారాన్ని తింటే విద్యార్థుల ప్రాణాలకు గ్యారెంటీ ఎవరు? అల్లారుముద్దుగా పెంచుకున్న తల్లిదండ్రులకు భరోసా ఎక్కడ అని ప్రశ్నించారు. ఇలాంటి కలుషిత ఆహారం వల్లన, ఆడుకోవాల్సిన పిల్లలు ఆసుపత్రుల పాలు అవుతున్నారని పేర్కొన్నారు.
కాంగ్రెస పాలన అంతా అస్తవ్యస్థంగా మారిందని, అందుకే విద్యార్థులకు అవస్థలు, అస్వస్థత అని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఏం జరుగుతుందని ప్రశ్నించారు. ఇకనైనా కాంగ్రెస్ ప్రభుత్వం మెల్కోపోతే రేపటి తరానికి ఎదగాల్సిన పిల్లలు వెనకబడిపోతారని, అంతే కాదు విద్యార్థుల ప్రాణాలకే ప్రమాదని హెచ్చరించారు. ఇకనైన సరైనా నిర్ణయాలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి హితవు పలికారు.