»Sandeep Kishan Food Safety Officials Check At Hero Restaurant
Sandeep Kishan: హీరో రెస్టారెంట్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీ
ఫుడ్ బాగా లేకపోయని, నాసిరకం పదార్థాలు వాడుతున్న, కిచెన్ క్లీన్‌గా లేకపోయిన ఫుడ్ సేఫ్టీ అధికారులు కేసు నమోదు చేసి సీజ్ చేస్తున్నారు. అయితే ఈ క్రమంలో అధికారులు సందీప్ కిషన్ రెస్టారెంట్ అయిన వివాహా భోజనంబును తనిఖీ చేశారు. నాసిరకం పదార్థాలు వాడుతున్నట్లు గుర్తించి కేసు నమోదు చేశారు.
Sandeep Kishan: Food safety officials check t hero restaurant
Sandeep Kishan: హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఫుడ్ బాగా లేకపోయని, నాసిరకం పదార్థాలు వాడుతున్న, కిచెన్ క్లీన్‌గా లేకపోయిన కేసు నమోదు చేసి సీజ్ చేస్తున్నారు. ఈక్రమంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు టాలీవుడ్ నటుడు సందీప్ కిషన్ రెస్టారెంట్‌ను తనిఖీ చేశారు. వివాహా భోజనంబు పేరుతో ఉన్న ఈ రెస్టారెంట్లో ఆంధ్ర భోజనంతో పాటు తెలంగాణ వంటకాలు కూడా బాగా ఫేమస్. ఈ రెస్టారెంట్లో అధికారులు తనిఖీ చేయగా.. నాసిరకం పదార్థాలను రెస్టారెంట్ యాజమాన్యం వాడుతున్నట్లు అధికారులు గుర్తించారు.
?????? ??????????, ???????????? 08.07.2024
* FSSAI license true copy was displayed at the premises.
* Chittimutyalu Rice (25kg) was found with Best Before date as 2022 and 500gms of Coconut Grates found with synthetic food colours. Stock has been… pic.twitter.com/yY5yWkknk1
— Commissioner of Food Safety, Telangana (@cfs_telangana) July 10, 2024
2022నాటికి గడువు పూర్తయిన 25 కిలోల చిట్టి ముత్యాల రైస్ బ్యాగు ఉంది. వీటితో పాటు 500 గ్రాముల కొబ్బరి తురుములో సింథటిక్ ఫుడ్ కలర్స్ కలిపినట్లుగా అధికారులు గుర్తించారు. వండిన ఫుడ్‌ను స్టీల్ గిన్నెలో పెట్టి ఉంచారని, వాటికి సరైన లేబుల్స్ లేవని అధికారులు తెలిపారు. అలాగే కిచెన్‌లో చెత్తబుట్టలకు ఎక్కడ కూడా మూతలు లేవని, కిచెన్ ప్రాంతంలో డ్రైన్ నీరు నిల్వ ఉండిపోయిందని అధికారులు తెలిపారు. అలాగే ఫుడ్ హ్యాండిల్ చేసే వాళ్ల ఆరోగ్య పరిస్థితి సంబంధించి ధ్రువీకరణ పత్రాలు లేవు. వంటల కోసం వాటల్ బబుల్ వాడుతున్నట్లు తెలిపారు.