»Ooru Peru Bhairavakona Town Name Bhairavakona 2 Days Collections Is Sandeep Hitting Hard
Ooru Peru Bhairavakona: ‘ఊరు పేరు భైరవకోన’ 2 డేస్ కలెక్షన్స్..సందీప్ గట్టిగా కొడుతున్నాడే?
సందీప్ కిషన్ నటించిన లేటెస్ట్ ఫిల్మ్ ఊరు పేరు భైరవకోన. ప్రీమియర్స్ సోష్తో కాస్త మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా.. థియేటర్లోకి వచ్చాక మంచి టాక్ సొంతం చేసుకుంది. దీంతో రెండు రోజుల్లో గట్టిగానే వసూళ్లు చేస్తోంది.
Ooru Peru Bhairavakona: పోయిన వారం వచ్చిన రవితేజ ‘ఈగల్’ సినిమాకు మంచి టాక్ వచ్చినప్పటికీ.. పెద్దగా సౌండ్ చేయడం లేదు. దీంతో సందీప్ కిషన్ సినిమాకు పాజిటివ్ టాక్ రావడం ప్లస్‌గా మారింది. చాలా కాలంగా హిట్ కోసం వెయిట్ చేస్తూ సతమతమవుతున్న సందీప్ కిషన్‌కు ఊరు పేరు భైరవ కోన రిజల్ట్ మంచి ఊరటనిచ్చింది. పలు వాయిదాల అనంతరం ఫిబ్రవరి 16న థియేటర్లోకి వచ్చింది ఊరు పేరు భైరవకోన. వీఐ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కావ్య థాపర్, వర్ష బొల్లమ్మ హీరోయిన్లుగా నటించారు.
అనిల్ సుంకర సమర్పణలో రాజేశ్ దండా ఈ మూవీని నిర్మించారు. ఈ సినిమా పై ఉన్న నమ్మకంతో ఓ రోజు ముందే ప్రీమియర్స్ షోస్ వేశారు మేకర్స్. ప్రీమియర్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ రాబట్టింది ఊరు పేరు భైరవకోన. ఫస్ట్ డే ప్రపంచవ్యాప్తంగా 6 కోట్ల 3 లక్షల రూపాయల గ్రాస్ వచ్చినట్టు మేకర్స్ ప్రకటించారు. అయితే.. డే వన్ కంటే డే 2 వసూళ్లు మరింత పెరిగాయి. రెండు రోజుల్లో 13 కోట్ల పది లక్షలు గ్రాస్ వసూళ్లను రాబట్టింది ఊరు పేరు భైరవకోన.
ఇదే విషయాన్ని అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ఇక థర్డ్ డే సండే అవడంతో ఈ వసూళ్లు మరింత పెరిగే ఛాన్స్ ఉంది. మొత్తంగా మూడు రోజుల్లోనే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ రీచ్ అయ్యేలా కనిపిస్తోంది. పది కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో రిలీజ్ అయిన భైరవకోన.. మూడు రోజుల్లో 20 కోట్ల గ్రాస్ రాబడితే మండే నుంచి లాభాల బాట పట్టినట్టే. మరి లాంగ్ రన్లో భైరవకోన ఎంత రాబడుతుందో చూడాలి.