ELR: పోలవరం ప్రాజెక్టు అథారిటీ బృందం బుధవారం ప్రాజెక్టు పనులను సందర్శించనుంది. సీఈవో నేతృత్వంలోని ఈ బృందం ఎగువ కాఫర్ డ్యాం, ఈసీఆర్ఎఫ్ డ్యాం, గ్యాప్-1, 2 పనులు, డయాఫ్రంవాల్ను క్షేత్రస్థాయిలో తనిఖీ చేస్తుంది. అనంతరం క్వాలిటీ కంట్రోల్ ల్యాబ్‌ను పరిశీలించి, నిర్వాసితుల పునరావాస కాలనీల్లో సౌకర్యాలను అడిగి తెలుసుకోనుందని అధికారులు తెలిపారు.