AP: వానరాల(కోతులు)ను చంపి వాహనంలో తీసుకొచ్చి రోడ్డుపక్కన పడేసిన ఘటన వైఎస్సార్ కడప జిల్లా టేకూరుపేట ఫారెస్టు చెక్‌పోస్టు సమీపంలో చోటుచేసుకుంది. పశువులను మేపేందుకు వెళ్లిన కాపర్లు రోడ్డుపక్కన 21 వానరాలు విగతజీవులుగా పడి ఉండటాన్ని చూసి అటవీశాఖ అధికారులకు తెలిపారు. బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకోవాలని కోరారు. వానరాలు విద్యుదాఘాతానికి గురైన ఆనవాళ్లు ఉన్నట్లు తెలుస్తోంది.