BHNG: పాముకాటుతో మృతిచెందిన మండల ఫొటో అండ్ వీడియో గ్రాఫర్ సంక్షేమ సంఘం సభ్యుడు రమేశ్ కుటుంబానికి యూనియన్ ఆర్థిక సహాయం అందించింది. సంఘం సభ్యులు చందాలు పోగుచేసి రూ.90 వేల బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్ బాండును జిల్లా అధ్యక్షుడు భోగ చంద్రశేఖర్, మండలాధ్యక్షుడు దోర్నాల గణేశ్ చేతుల మీదుగా కుటుంబానికి అందజేశారు.