ASR: అన్నవరం పోలీసు స్టేషన్ ఎస్సైగా కొత్త సాయిరాం మంగళవారం బాధ్యతలను స్వీకరించారు. ఇప్పటి వరకు ఇక్కడ ఎస్సైగా పనిచేసిన జి.వీరబాబు చింతపల్లి ఎస్సైగా బదిలీ అయ్యారు. ఈమేరకు అన్నవరం పోలీసు స్టేషన్కు సాయిరాంను నియమిస్తూ ఎస్పీ అమిత్ బర్దార్ ఉత్తర్వులు జారీ చేశారు. స్టేషన్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని ఎస్సై సాయిరాం తెలిపారు.