AP: సంక్రాంతి సందర్భంగా ఆప్కో షోరూంలలో భారీ రాయితీలపై వస్త్రాలు విక్రయించనున్నట్లు మంత్రి సవిత వెల్లడించారు. 40, 50, 60 శాతం రాయితీలపై చేనేత వస్త్రాల విక్రయాలు ఉంటాయన్నారు. 60 శాతం రాయితీపై గుంటూరులో, విజయవాడలో 50 శాతం రాయితీపై ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని మిగిలిన అన్ని షోరూంలలో 40 శాతం రాయితీ వర్తింపజేయాలని తెలిపారు.