WGL: దుగ్గొండి పోలీస్ స్టేషన్ను మంగళవారం వెస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్ తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని సిబ్బందికి సూచించారు. ఎఫ్ఐఆర్ కాపీలను పరిశీలించారు. అనంతరం చట్ట వ్యతిరేక కార్యకలాపాలు, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై చర్యలు తీసుకోవాలన్నారు.