ASR: పాడేరు డీఎస్పీ షైక్ షహబాజ్ అహ్మద్ బదిలీ అయ్యారు. ఆయనను శ్రీకాకుళం జిల్లా పలాస (కాశీబుగ్గ) కు బదిలీ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. షైక్ షహబాజ్ అహ్మద్ ముందుగా చింతపల్లి డీఎస్పీగా పని చేశారు. అనంతరం పాడేరు డీఎస్పీగా సుమారు ఏడాది పాటు సేవలు అందించారు. ఆయన స్థానంలో పాడేరు డీఎస్పీగా 2023 బ్యాచ్‌కు చెందిన అభిషేక్‌ను నియమించారు.