NLG: తెలంగాణలో మాతృదేవతను పూజించడం ద్రావిడ సంస్కృతికి ప్రతీక అని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఆచార్య విజయలక్ష్మి అన్నారు. నల్గొండ ఎంజీయూ తెలుగు శాఖలో నిర్వహించిన అతిథి ప్రసంగంలో ఆమె పాల్గొని మాట్లాడారు. తెలంగాణ భాషా–సంస్కృతి ద్రావిడ సంప్రదాయంతో మమేకమై తన ప్రత్యేక అస్తిత్వాన్ని నిలుపుకుందని తెలిపారు.