NZB: నవీపేట్ మండలంలోని పోతంగల్ గ్రామంలో నూతనంగా 33 కేవీ లైన్ పనులు కొనసాగుతున్నందున నేడు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు అసిస్టెంట్ డివిజనల్ ఇంజినీర్ ప్రశాంత్ రెడ్డి తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 11 కేవీ ఫీడర్‌కు విద్యుత్ సరఫరా ఉండదన్నారు. ఈ సమయంలో పొతంగల్ గ్రామానికి సంబంధించిన వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.