KMM: కొత్త లింగాల ధనలక్ష్మి ఫంక్షన్ హాల్లో బుధవారం ప్రభుత్వం నిర్వహించే క్రిస్మస్ వేడుకలకు ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య ముఖ్య అతిథిగా హాజరవుతారని మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గింజల నరసింహారెడ్డి తెలిపారు. మధ్యాహ్నం 12:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.