NLR: సీతారామపురం మండలం బసినేనిపల్లి డాబా ప్రాంతంలో జాతీయ రహదారి (167BG) పై మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. మర్రిపాడు (M) రాజుపాలెం గ్రామానికి చెందిన ప్రసన్న కుమార్ అత్తగారి ఊరైన దేవమ్మచెరువు ఇంటికి వస్తున్నక్రమంలో గేదెలు అడ్డురావటంతో బైకు అదుపు తప్పి కింద పడింది. దీంతో తలకి స్వల్ప గాయాలయ్యాయి. 108 అంబులెన్స్ ద్వారా ఆస్పత్రికి తరలించారు.