NTR: ఏసుక్రీస్తు బోధనలు సర్వ మానవాళికి ఆదర్శమని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు పేర్కొన్నారు. కొండపల్లిలో నిన్న రాత్రి నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకలలో ఆయన పాల్గొన్నారు. అనంతరం కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. క్రిస్మస్ పండుగ శాంతి, ప్రేమ, కరుణ, త్యాగం వంటి మానవీయ విలువలకు ప్రతీక అని ఆయన తెలిపారు.