W.G: యువతలోని క్రీడా నైపుణ్యాన్ని వెలికితీసేందుకే ‘సంసద్ ఖేల్ మహోత్సవ్’ నిర్వహిస్తున్నట్లు కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. మంగళవారం భీమవరం, మార్టేరు, పాలకోడేరు కేంద్రాల్లో ఆయన పోటీలను ప్రారంభించారు. పాలకోడేరు జడ్పీ హైస్కూల్ మైదానంలో వాలీబాల్, కబడ్డీ పోటీలు ఉత్సాహంగా సాగాయి. విజేతలకు గురువారం బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేయనున్నారు.