SDPT: ముస్త్యాల గ్రామానికి చెందిన అవధూత లక్ష్మయ్య మనుమరాలు హరీష్మిత మెడ సమస్యతో బాధపడుతోంది. శస్త్రచికిత్సకు రూ.5 లక్షలు అవసరమని తెలియడంతో, బీఆర్ఎస్ మండల యూత్ అధ్యక్షుడు ఆకుల రాజేష్ గౌడ్ చొరవతో శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికేపూడి గాంధీని ఆశ్రయించారు. ఎమ్మెల్యే వెంటనే స్పందించి రూ.2.50 లక్షల విలువైన LOC చెక్కును మంజూరు చేయించి బాధితులకు అందజేశారు.