JN: గెలిచిన వార్డు మెంబర్స్ అందరూ ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా చూడాలని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అన్నారు. పాలకుర్తి మేజర్ గ్రామ పంచాయతీలో గెలుపొందిన పలువురు వార్డ్ మెంబర్స్‌ను అభినందించి వారు మాట్లాడారు . ప్రజల గుండెలో సుస్థిర స్థానం పొంది రానున్న ఏ ఎన్నికలైనా కాంగ్రెస్ అభ్యర్థులను గెలిచే విధంగా పనిచేయాలని సూచించారు.