జనవరి 1 నుంచి రైలు వేళల్లో స్వల్ప మార్పులు జరగనున్నాయి. గతంలో జూలై 1 నుంచి మార్చే వారు. ఇప్పుడు దాన్ని జనవరి 1 నుంచి మారేలా సవరించారు. దేశవ్యాప్తంగా 1,400 రైళ్ల వేళలను సవరిస్తుండగా, ద.మ. రైల్వే పరిధిలో 80కి పైగా రైళ్ల వేళలు మారుతున్నాయి. 3 నిమిషాల నుంచి గరిష్ఠంగా 30 నిమిషాల వరకు సమయాలను మారుస్తున్నారు. మారిన వివరాలు IRCTC వెబ్సైట్లో అప్లోడ్ చేయనున్నారు.