NLG: ఉమ్మడి నల్లగొండ జిల్లా స్థాయి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ – 2025 మంగళవారం నల్లగొండ పట్టణంలో ప్రారంభమైంది. ఉమ్మడి జిల్లాలోని 5 ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలోని విద్యార్థులు హాజరై వివిధ క్రీడాల్లో తలపడ్డారు. నల్లగొండ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ నర్సింహ్మరావు క్రీడా పోటీలను ప్రారంభించారు.