KRNL: ఆదోని రేంజ్లో రైలు ఢీకొని చిరుత, మార్కాపురం అటవీ డివిజన్లో వాహనం ఢీకొని ఆడ పులి మంగళవారం మరణించాయి. ఈ ఘటనలపై Dy.CM పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. 2 ప్రమాదాలపై విచారణ చేపట్టి నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. హాట్ స్పాట్లను గుర్తించి హెచ్చరిక బోర్డులు, రిఫ్లెక్టర్లు ఏర్పాటు చేయాలన్నారు. అటవీ మార్గాల వెంట వాహనదారులు వేగం తగ్గించాలన్నారు.