KDP: స్వచ్ఛ సమృద్ధి లక్ష్యంగా కడప నగరంలో ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లను నిషేధించి,ప్రభుత్వ కార్యాలయాలకు గాజు బాటిళ్ల ద్వారా నీటి సరఫరా చేయాలని నగరపాలక స్టాండింగ్ కమిటీ నిర్ణయించింది. మేయర్ పాకా సురేశ్ కుమార్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ తీర్మానానికి ఆమోదం తెలిపారు. సత్య ఎస్ఎల్జీ ద్వారా గాజు బాటిళ్ల తయారీ చేసి ప్రభుత్వ కార్యాలయాలు, ప్రజలకు సరఫరా చేయనున్నారు.