W.G. భీమవరం మండలం దిరుసుమర్రుకి చెందిన గూడవల్లి కులశేఖర్ నరసాపురం వెళ్తుండగా తిరుమాని చంద్ర శేఖర్ (23) దారి అడ్డగించి దౌర్జన్యంగా కొట్టి ఫోన్, 1,000 నగదును అపహరించారు. టౌన్ సీఐ బి.యాదగిరి కేసు నమోదు చేసి విచారణ జరిపారు. నేరం రుజువు కావడంతో ముద్దాయికి నరసాపురం అడిషనల్ సివిల్ జడ్జి రాజ్యలక్ష్మి మంగళవారం ఏడాది జైలు విధించినట్లు సీఐ యాదగిరి తెలిపారు.