న్యాచురల్ స్టార్ నాని హీరోగా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్న చిత్రం ‘ది ప్యారడైజ్’. ఈ మూవీలో హీరోయిన్గా కయాదు లోహర్ నటిస్తున్నట్లు ఎన్నోరోజులుగా వార్తలొస్తున్నాయి. తాజాగా ఈ ప్రచారంపై కయాద్ పరోక్షంగా స్పందించింది. ‘ది ప్యారడైజ్’ గ్లింప్స్‌ను సోషల్ మీడియాలో ఆమె షేర్ చేసింది. దీంతో హీరోయిన్గా కయాదు ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.