KDP: మైదుకూరు సమీపంలోని బస్వపురం టోల్ గేట్ వద్ద ముళ్ల పొదల్లో కోడి పందాలు ఆడుతున్న ఆరుగురిని అదుపులోకి తీసుకున్నట్లు సీఐ రమణా రెడ్డి తెలిపారు. వీరి నుంచి రూ.2,800 నగదుతో పాటు కోడి పుంజును స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. జూదం, కోడి పందాలు, అక్రమ మద్యం, గంజాయి వంటి వాటికి సంబంధించి సమాచారం ఉంటే వెంటనే తమ దృష్టికి తేవాలన్నారు.