టర్కీ రాజధాని అంకారాలో విషాదం చోటుచేసుకుంది. ఓ ప్రైవేట్ జెట్ టేకాఫ్ అయిన కాసేపటికే కుప్పకూలింది. ఈ ప్రమాదంలో లిబియా సైన్యాధ్యక్షుడు అలీ, నలుగురు అధికారులు సహా మొత్తం 8 మంది మృతి చెందారు. సాంకేతిక లోపం వల్లే ఈ ఘోరం జరిగిందని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ వార్తతో లిబియా సైన్యంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.