అన్నమయ్య: మదనపల్లి నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త నిసార్ అహమ్మద్ మంగళవారం నిమ్మనపల్లె మండలంలో పర్యటించి, కార్యకర్తలు, నాయకులతో సమావేశమయ్యారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వార్డు మెంబర్ నుంచి ఎంపీపీ, జడ్పీటీసీ వరకు అందరినీ గెలిపించుకోవాలని, పార్టీ బలోపేతానికి సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. జగనన్నను మళ్లీ ముఖ్యమంత్రిని చేయాలని ఆయన సూచించారు.