మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని BC వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్‌ను మంగళవారం కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టోర్ గది, కిచెన్ షెడ్, డైనింగ్ హాల్, టాయిలెట్స్, తరగతి గదులను పరిశీలించారు. భోజనం సిద్ధం చేసే సిబ్బంది తగు జాగ్రత్తలు వహించాలని, పిల్లలకు మెనూ ప్రకారం ఆహారం అందించాలని సూచించారు.