ATP: పాపంపేట భూవివాదం కేసులో విధుల్లో నిర్లక్ష్యం వహించిన వీఆర్వో రఘుయాదవ్ను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఆనంద్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం, ఉన్నతాధికారులను పక్కదారి పట్టించారనే ఆరోపణల నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నారు. ప్రభుత్వ భూముల రక్షణలో నిర్లక్ష్యం వహిస్తే ఎవరినీ సహించేది లేదని హెచ్చరించారు.