మెక్సికోలో నేవీ విమానం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ఏడాది చిన్నారి సహా ఐదుగురు మృతి చెందారు. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు, వైద్య సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.