PPM: జిల్లా అధికారులు, ఎంపిడివోలు తమ పరిధిలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ హాస్టళ్లను విధిగా సందర్శించాలని కలెక్టర్ డా, ప్రభాకరరెడ్డి మంగళవారం తెలిపారు. అధికారులు తనిఖీలకు వెళ్ళినపుడు చెక్ లిస్ట్ ప్రకారం అక్కడ వసతులు, సదుపాయాలు, పరిశుభ్రత, నాణ్యమైన విద్య ఆహార నాణ్యత ప్రమాణాలను ఖచ్చితంగా పరిశీలించాలని ఆయన సూచించారు. నివేదిక ఆనంతరం తదుపరి చర్యలు ఉంటాయన్నారు.