BPT: బాపట్ల నియోజకవర్గంలో కర్లపాలెం నుంచి పెద్దపులుగువారి పాలెం వరకు 10 కి.మీ రోడ్డును రూ.4.75 కోట్లతో నిర్మించేందుకు జిల్లా ఇంఛార్జ్ మంత్రి కొలుసు పార్థసారధి, ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రతి ఒక్క పని చేసుకుంటు వస్తున్నామని తెలిపారు.