కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన వాడపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయ పాలకవర్గం ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని ఈనెల 29న నిర్వహిస్తున్నట్లు దేవస్థానం ఛైర్మన్ ముదునూరి వెంకటరాజు తెలిపారు. మంగళవారం సాయంత్రం ఆత్రేయపురం ఆయన స్వగృహంలో మండల కూటమి నాయకులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో కూటమి నాయకుల ఆహ్వానం, ఏర్పాట్లపై చర్చించారు.