ACP’s Transfer :పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాష్ట్రంలోని పలు కీలక శాఖల్లో భారీగా బదిలీలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ వ్యాప్తంగా 61 మంది ఏసీపీ అధికారులను బదిలీ చేస్తూ డీజీపీ రవిగుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, శనివారం 12 మంది అదనపు ఎస్పీలను బదిలీ చేశారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఇప్పటికే మున్సిపల్ కమిషనర్లు, డీఎస్పీలు, ఆర్డీఓలు, ఐపీఎస్ అధికారులు, అదనపు కలెక్టర్లను ప్రభుత్వ అధికారులు బదిలీ చేశారు.
62మంది డీఎస్పీల బదిలీ
రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మరో 62 మంది డీఎస్పీలను బదిలీ చేసింది. హైదరాబాద్లో పలువురు ఏసీపీలను కాంగ్రెస్ ప్రభుత్వం బదిలీ చేసింది. డీజీ కార్యాలయంలో వేచి ఉన్న డీఎస్పీలందరికీ పోస్టింగ్ ఇచ్చారు. కాగా, రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 300 మందికి పై చిలుకు డీఎస్పీలు బదిలీ అయ్యారు. అయితే రానున్న రోజుల్లో మరికొన్ని శాఖల్లో కూడా అధికారుల బదిలీలు చేపట్టనున్న సంగతి తెలిసిందే.