»Chiranjeevi Wife Chiranjeevis Wife Surekha Entered The Food Business On Her Birthday
Chiranjeevi Wife: బర్త్ డే రోజు ఫుడ్ బిజినెస్‌లోకి అడుగుపెట్టిన చిరంజీవి భార్య సురేఖ
టాలీవుడ్ ఇండస్ట్రీలో చిరంజీవి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. స్వయంకృషితో అంచెలంచెలుగా ఎదిగి మెగాస్టార్ రేంజ్ కు చేరుకున్నారు. ప్రస్తుతం తెలుగు చిత్రపరిశ్రమకే పెద్ద దిక్కుగా మారారు.
Chiranjeevi Wife: టాలీవుడ్ ఇండస్ట్రీలో చిరంజీవి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. స్వయంకృషితో అంచెలంచెలుగా ఎదిగి మెగాస్టార్ రేంజ్ కు చేరుకున్నారు. ప్రస్తుతం తెలుగు చిత్రపరిశ్రమకే పెద్ద దిక్కుగా మారారు. ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా సుపరిచితులే. భర్త అడుగుజాడల్లో నడుస్తూ చిరంజీవి ఎదుగుదలలో ముఖ్యపాత్ర పోషించిన సురేఖ నేడు పుట్టిన రోజు జరుపుకొంటుంది. ఈ సమయంలోనే ఆమె కొత్త ఫుడ్ బిజినెస్ మొదలుపెట్టినట్లు ప్రకటన వెలువడింది. నిజానికి ఆమె కొత్త బిజినెస్ లోకి దిగుతున్నారు అనే ప్రచారం కొద్దిరోజుల నుంచి జరుగుతోంది. ఇప్పటివరకు హౌస్ వైఫ్ గా ఉన్న ఆమె కుటుంబం అంతా యాక్టర్లే కాబట్టి నిర్మాతగా వ్యవహరిస్తారన్న టాక్ నడిచింది. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఆమె ఫుడ్ బిజినెస్ ప్రారంభించినట్లు ఆమె కోడలు ఉపాసన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఎక్కడ ఉన్నామనే విషయం పక్కన పెడితే సౌత్ ఇండియన్ ఫుడ్ మిస్ అవ్వకుండా చేసేలా ఈ అత్తమ్మాస్ కిచెన్ వ్యవహరిస్తుందని పేర్కొన్నారు. అంతే కాదు ప్రస్తుతానికి నాలుగు ప్రొడక్ట్స్ అమ్మకానికి కూడా పెట్టారు. అందుకుగాను ఒక వెబ్ సైట్ (https://athammaskitchen.com/) కూడా అందుబాటులో తీసుకొచ్చారు.
ప్రస్తుతానికి ఉప్మా మిక్స్, పులిహోర పేస్ట్, పొంగల్ మిక్స్, రసం పౌడర్ నాలుగు ప్రొడక్ట్స్ అమ్ముతున్నారు. ఈ నాలుగు కలిపి కొనాలనుకునే వారికి 1099 రూపాయలు ఛార్జ్ విధిస్తున్నారు. తన అత్తమ్మ పుట్టినరోజు నాడే ఈ కొత్త వెంచర్ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించడం చాలా గర్వంగా ఉందని ఉపాసన వెల్లడించారు. ముఖ్యంగా సొంత ఇంట్లో లేని వారు అంటే బ్యాచిలర్స్ లేదా సొంత ప్రాంతానికి దూరంగా ఉంటున్న వారు వీలైనంత త్వరగా సౌత్ ఇండియన్ డిషెస్ ఇన్ స్టాంట్ గా చేసుకునేందుకు ఈ వెంచర్ స్టార్ట్ చేస్తున్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతానికి ఇండియాలో మాత్రమే ఈ బిజినెస్ మొదలుపెట్టినా త్వరలోనే విదేశాల్లో ఉన్న తెలుగు వారు సౌత్ ఇండియన్ పీపుల్ కి అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.