»Upasana That Surekha Doesnt Get Avakaya Pachadi Athammas Kitchen Funny Video Viral
Upasana: అత్తమ్మకు అవకాయ పచ్చడి పెట్టడం రాదంటున్న ఉపాసన.. ఫన్నీ వీడియో వైరల్
కొణిదెల వారి కోడలు ఉపాసన సామాజీక కార్యక్రమాల్లో ఎంతో ఉత్సాహంగా పాల్గొంటారన్న విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉండే ఉపాసన తాజాగా ఓ వీడియో పోస్ట్ చేసింది. అందులో సురేఖకు అవకాయ పచ్చడి చేయడం రాదని అంటుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
Upasana that Surekha doesn't get avakaya pachadi..athammas kitchen funny video viral
Upasana: మెగాస్టార్ చిరంజీవి ఆయన తనయుడు రామ్ చరణ్ సినిమా పరిశ్రమలో బిజీగా ఉంటే ఆయన సతీమణి సురేఖ, కోడలు ఉపాసన వ్యాపారంలో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ మధ్యే అత్తమ్మ కిచెన్ పేరుతో ఫుడ్ బిజినెస్ మొదలుపెట్టారు. అప్పటికప్పుడు వండుకునేలా డ్రై హోమ్ ఫుడ్స్‌ని తయారుచేస్తూ.. కస్టమర్లకు అందిస్తున్నారు. అందులో భాగంగా తాజాగా మామిడికాయల పచ్చడి పెట్టారు. ఈ సందర్భంగా ఉపాసన ఓ వీడియోను పంచుకుంది. అంజనదేవి సమక్షంలో అత్తమ్మ అవకాయ పచ్చడి చేస్తుంది అనే క్యాప్షన్ కూడా పెట్టారు.
ఏంటి నాన్నమ్మ సిరీయస్‌గా ఉన్నారు అంటే సిరీయస్ ఏం లేదు, పని ఏం లేక అని అంజనమ్మ అంటుంది. ఏంటి మీ కోడలకు పచ్చడి చేయడం రావట్లేదా అని సురేఖను ఉద్దేశించి ఉపాసన అంటే తనకు రాకపోతే నువ్వు ఉన్నావు కదా అని అంజనమ్మ అంటుంది. తరువాత సురేఖ దగ్గరకు వెళ్తే ఇది ఏంటి అని అడగకమ్మ అని అంటే హిందీలో క్యా హోరా అని ఉపాసన అడుగుతుంది. అది అసలు రాదు అని సురేఖ నవ్వుతారు. ఇది చూడడానికి చాలా ముచ్చటగా ఉంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది.