»Ram Charans Wife Upasana On Daughter Klin Kaaras 1st Birthday You Complete Us
klinkaara : నేడు క్లీంకార ఫస్ట్ బర్త్‌డే.. ఉపాసన, రామ్‌చరణ్‌లు ఏమంటున్నారంటే..?
మెగా ఇంట మనవరాలు క్లీంకార వచ్చి అప్పుడే ఏడాది అయిపోయింది. మెగాస్టార్ ఇంట ఆమె మొదటి సంవత్సర పుట్టిన రోజు వేడుకలు సరదా సరదాగా ప్రారంభం అయ్యాయి. ఈ సందర్భంగా రామ్‌చరణ్, ఉపాసన జంట చాలా ఎమోషనల్ అయ్యారు. వారేమంటున్నారంటే?
klin kaara first birthday : రామ్‌చరణ్, ఉపాసన దంపతుల ముద్దు బిడ్డ క్లీంకార పుట్టి అప్పుడే ఏడాది అయిపోయింది. ఆ బుజ్జాయి మొదటి పుట్టిన రోజు సందర్భంగా ఉపాసన(Upasana) తన ఇన్‌స్టాలో కొన్ని సంగతుల్ని పంచుకున్నారు. క్లీంకార తమ జీవితంలోకి వచ్చి మరింత సంతోషాన్ని నింపిందని అన్నారు. అలాగే పాపని మొదటిసారి ఎత్తుకున్న క్షణం తనకు మర్చిపోలేనిదని చరణ్(Ram Charan) అన్నారు.
క్లీంకార ముఖాన్ని ఇప్పటి వరకు మీడియాకి చూపించలేదు. చిన్న చిన్న లీక్‌లు వచ్చినా స్పష్టమైన క్లీంకార ముఖాన్ని ఇప్పటి వరకు అభిమానులు చూడలేదు. దీంతో ఈ రోజైనా చిన్నారిని చూపిస్తారా? అంటూ ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. బుజ్జి క్లీంకారకు(klin kaara) బర్త్ డే విషెస్ చెబుతూ కామెంట్ బాక్స్‌లను షేక్ చేస్తున్నారు.
క్లీంకార(klin kaara) పుట్టినప్పటి నుంచి మెగా కుటుంబంలో అన్నీ శుభకరమైన సూచనలే కనిపిస్తున్నాయి. చిరంజీవికి పద్మ విభూషణ్ రావడం, పవర్ స్టార్ భారీ మెజార్టీతో గెలుపొందడం లాంటివన్నీ ఆమె పుట్టిన తర్వాత వరుస పెట్టి వస్తున్నాయంటున్నారు మెగా ఫ్యాన్స్. ఉపాసన గర్భం దాల్చిన సమయం నుంచి పాపకు నామకరణం చేసేంత వరకు వారి జీవితంలో ఏమేం మార్పులు చోటు చేసుకున్నాయో, ముఖ్యమైన రోజులు ఏమిటి లాంటి ఓల్డ్ మెమోరీస్ అన్నింటినీ ఉపాసన ఇన్‌స్టాలో షేర్ చేసుకున్నారు.