»Ram Charan Wallpaper Viral But Ram Charan Is Great
Ram Charan: వాల్ పేపర్ వైరల్.. కానీ రామ్ చరణ్ గ్రేట్!
ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ రేంజ్ క్రేజ్ సొంతం చేసుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ఇవేవి పట్టవన్నట్టుగా చాలా సింపుల్‌గా ఉంటాడు. లేటెస్ట్గా చరణ్‌కు సంబంధించిన వీడియోనే ఇందుకు నిదర్శనం అని చెప్పొచ్చు.
Ram Charan: Wallpaper viral.. But Ram Charan is great!
Ram Charan: రామ్ చరణ్ అంటే, మెగాస్టార్ చిరంజీవి కొడుకు, మెగా పవర్ స్టార్, గ్లోబల్ స్టార్ అంటే ఎలా ఉండాలి? చాలా గర్వంగా ఉండాలి, లేదంటే పొగరుగా ఉండాలి. కానీ ఇవేవి రామ్ చరణ్‌కి కనిపించవు. తన ముందు ఏదైనా దిగదుడుపే అనేలా ఉంటాడు. చెప్పాలంటే.. తన క్రేజ్‌ను పక్కకు పెట్టేసి చాలా సింపుల్‌గా ఉంటాడు చరణ్. ఎంతలా అంటే, రీసెంట్గా బాబాయ్ పవన్ కళ్యాణ్ కోసం పిఠాపురం వెళ్లగా.. ఒక్కసారిగా చరణ్ పై ఎగబడిపోయారు అబిమానులు.
అంతేకాదు.. చరణ్ చొక్కా పట్టుకొని లాగేశారు కొందరు ఫ్యాన్స్. అయినా కూడా చరణ్ కనీసం వాళ్ల వైపు కన్నెత్తి చూడకుండా, ఏమి అనకుండా వెళ్లిపోయాడు. అందుకు సంబంధించిన వీడియో చూసి మెగా ఫ్యాన్స్ చాలా డిస్టర్బ్ అయ్యారు. కానీ చరణ్ మాత్రం చాలా ఓపిగ్గా అంత పెద్ద క్రౌడ్ మధ్యలో నుంచి వెళ్లిపోయాడు. ఇదే కాదు.. చాలా విషయల్లో సింపుల్‌గా, కామ్‌గా ఉంటాడు చరణ్. అతన్ని కోపంగా చూసిన సందర్భాలు చాలా తక్కువ. అందుకే.. చరణ్ గ్రేట్ అంటున్నారు మెగాభిమానులు. తండ్రికి తగ్గ తనయుడుగా దూసుకుపోతున్న చరణ్‌ను చూసి అభిమానులు తెగ మురిసిపోతున్నారు.
ఇదిలా ఉంటే.. మరోవైపు రామ్ చరణ్ ఫోన్ వాల్ పేపర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మెగాస్టార్ చిరంజీవి తాజాగా పద్మ విభూషణ్ అవార్డును అందుకున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి చరణ్, ఉపాసన కూడా హాజరయ్యారు. ఈ క్రమంలోనే రామ్ చరణ్ ఫోన్ వాల్ పేపర్ నెట్టింట వైరల్‌గా మారింది. తమ కుటుంబ ఆరాధ్య దైవం ఆంజనేయ స్వామి ఫోటోని వాల్ పేపర్‌గా పెట్టుకున్నాడు చరణ్. ఏదేమైనా.. చరణ్ మాత్రం గ్రేట్ అని అంటున్నారు అభిమానులు.