డైనమిక్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, ఎనర్జిటిక్ యంగ్ హీరో రామ్ పోతినేని కాంబినేషన్లో డబుల్ ఇస్మార్ట్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. మరి టీజర్ ఎలా ఉండబోతోంది.
Double Ismart: Double Ismart.. Our mass teaser is ready!
Double Ismart: ఇస్మార్ట్‌గా ఉండే ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేనిని ఊరమాస్ హీరోగా ప్రజెంట్ చేసి బాక్సాఫీస్ దగ్గరు దుమ్ముదులిపేశాడు పూరి జగన్నాథ్. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మాస్ ఆడియెన్స్‌కు మరింత దగ్గరయ్యాడు రామ్. అయితే.. ఇదే జోష్‌లో చేసిన వారియర్, స్కంద సినిమాలు మాత్రం బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టేశాయి. దీంతో మరోసారి రామ్, పూరి కలిసి డబుల్ ఇస్మార్ట్ సినిమా చేస్తున్నారు.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతోంది. అయితే.. మే 15న రామ్ బర్త్ డే ఉంది. దీంతో.. బర్త్ డే ట్రీట్‌గా టీజర్ రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు మేకర్స్. ముందు నుంచి చెబుతున్నట్టుగానే.. రామ్ బర్త్ డే గిఫ్ట్‌గా డబుల్ ఇస్మార్ట్ టీజర్ రిలీజ్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేసారు మేకర్స్. ఈ టీజర్ ఊరమాస్‌గా ఉంటుందని తెలుస్తోంది. పూరి మార్క్ డైలాగ్స్, రామ్ స్టైల్ ఆఫ్ మాస్ ఆటిట్యూడ్‌తో అదిరిపోయేలా టీజర్ కట్ చేస్తున్నట్టుగా సమాచారం. ఖచ్చితంగా పూరి ఈ టీజర్‌తో పాన్ ఇండియా హైప్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఇక ఈ టీజర్‌తో పాటు రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేసే ఛాన్స్ ఉంది.
వాస్తవానికైతే.. ఈ సమ్మర్లోనే డబుల్ ఇస్మార్ట్ రిలీజ్ కావాల్సి ఉంది. కానీ షూటింగ్ డిలే కారణంగా పోస్ట్ పోన్ చేశారు. జూన్ లేదా జూలైలో ఈ సినిమా రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ చిత్రంలో సంజయ్ దత్ విలన్‌గా నటిస్తుండగా పూరి, ఛార్మి నిర్మాణం వహిస్తున్నారు. ఈ సినిమాకు మెలోడీ బ్రహ్మ మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్నారు. మరి డబుల్ ఇస్మార్ట్ టీజర్ ఎలా ఉంటుందో చూడాలి.