ప్రస్తుతం వార్ 2 షూటింగ్‌తో బిజీగా ఉన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఓటు వేయడానికి హైదరాబాద్‌కి వచ్చాడు. ఈ సందర్భండా.. తన అభిమాని గుండెల పై ఆటోగ్రాఫ్ ఇచ్చిన వీడియో ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి అందరికీ తెలిసిందే. ప్రజెంట్ ఉన్న హీరోల్లో టైగర్‌కి ఉన్నంత మాస్ ఫాలోయింగ్ మరో హీరోకి లేదనే చెప్పాలి. ఒక్క తెలుగులోనే కాదు.. బాలీవుడ్లో కూడా ఎన్టీఆర్‌కు యమా క్రేజ్ ఉంది. ప్రస్తుతం ముంబైలో వార్ 2 షూటింగ్‌తో బిజీగా ఉన్న ఎన్టీఆర్.. తన ఓటు హక్కు వినియోగించుకోవడానికి హైదరాబాద్‌కు వచ్చాడు. తన భార్య, తల్లితో కలిసి ఉదయాన్నే పోలింగ్ కేంద్రానికి చేరుకొని ఓటు వేశారు. ఈ సందర్భంగా.. అందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని అన్నాడు టైగర్.
అయితే.. ఇదే సమయంలో ఎన్టీఆర్ ఓ అభిమాని కోరికను కూడా తీర్చాడు. ఎన్టీఆర్ కారెక్కబోతుండగా.. అక్కడున్న ఓ అభిమాని అన్నా ఆటోగ్రాఫ్ అని అడిగాడు. దాంతో వెంటనే ఎన్టీఆర్ సదరు అభిమాని గుండెల పై ఆటోగ్రాఫ్ ఇచ్చాడు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇక టైగర్ ఆటోగ్రాప్తో మురిసిపోయిన అభిమాని.. ఎన్టీఆర్‌కి థ్యాంక్స్ చెప్పడంతో పాటు.. అడ్వాన్స్డ్ బర్త్ డే విష్ చేశాడు. మే 20న ఎన్టీఆర్ బర్త్ డే వేడుకలు గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకోవడానికి రెడీ అవుతున్నారు నందమూరి ఫ్యాన్స్.
ఇప్పటికే సోషల్ మీడియాలో హడావిడి మొదలైపోయింది. టైగర్ కూడా బర్త్ డే గిఫ్ట్‌గా దేవర ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నాడు. అలాగే వార్ 2 ఫస్ట్ లుక్ కూడా బయటికి రానుంది. అదే రోజు ప్రశాంత్ నీల్ సినిమాకు సంబంవధించిన అప్టేట్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. దీంతో.. ఈసారి బర్త్ డే చాలా స్పెషల్ అని అంటున్నారు అభిమానులు.