AP Assembly Elections: YCP attacks not stopping even on polling day
AP Assembly Elections: పోలింగ్ రోజు కూడా వైసీపీ నేతలు దాడులు చేస్తున్నారు. ఒకవైపు పోలింగ్ కొనసాగుతున్న వైసీపీ నేతలు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. పోలీసు బందోబస్తు ఉన్నప్పటికీ దాడులు చేస్తున్నారు. ఓటేసేందుకు క్యూలైన్లో రావాలని చెప్పినందుకు ఓ ఓటరుపై తెనాలి వైసీపీ అభ్యర్థి శివకుమార్ చేయి చేసుకున్నారు. ఓటు వేసేందుకు క్యూలైన్లో కాకుండా నేరుగా శివకుమార్ వెళ్తుండటంతో ఓటరు అభ్యంతరం తెలిపారు. దీంతో శివకుమార్ అతనిపై దాడి చేశాడు. సహనం కోల్పోయిన ఓటరు కూడా అతని చెంప చెళ్లుమనిపించాడు. అలా ఇద్దరి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.
అనంతపురం జిల్లా తాడిపత్రి అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి సమక్షంలోనే వైసీపీ కార్యకర్తలు దౌర్జన్యానికి దిగారు. అలాగే అనకాపల్లి జిల్లాలో వైసీపీకు ఓటు వేయాలని పోలింగ్ కేంద్రం సమీపంలోనే వాలంటీర్లు ప్రచారం చేస్తున్నారు. దీనిపై టీడీపీ అభ్యంతరం తెలిపింది. విజయవాడ టీడీపీ అభ్యర్థి కేశినేని చిన్న బృందంపై వైసీపీ మూకలు రాళ్లతో దాడి చేశాయి. వైసీపీ నాయకులు దాడి చేస్తున్న పోలీసులు పట్టించుకోవట్లేదని టీడీపీ ఆరోపిస్తుంది. ఇలా రాష్ట్రమంతా వైసీపీ నాయకులు దాడిచేస్తున్నారు.