»Cm Jagan Cm Jagan Who Voted Along With His Family Members
CM Jagan: కుటుంబ సభ్యులతో కలిసి ఓటేసిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీతోపాటు లోక్సభ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. ఈక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన ఓటు హక్కును వినియోగించుకుని, ప్రజలకు పిలుపునిచ్చారు.
CM Jagan: CM Jagan who voted along with his family members
CM Jagan: ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీతోపాటు లోక్సభ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. ఈక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి పులివెందుల భాకరాపురం జయమ్మ కాలనీలోని 138వ పోలింగ్ కేంద్రంలో ఓటేశారు. ఈసందర్భంగా ఆయన క్యూలైన్లో నిల్చున్న ఓటర్లకు అభివాదం చేశారు. ప్రతిఒక్కరూ ఓటేయాలని పిలుపునిచ్చారు. అలాగే సోషల్ మీడియాలో పోస్ట్ కూడా చేశారు. నా అవ్వాతాతలందరూ…
నా అక్కచెల్లెమ్మలందరూ..
నా అన్నదమ్ములందరూ..
నా రైతన్నలందరూ..
నా యువతీయువకులందరూ..
నా ఎస్సీ..
నా ఎస్టీ..
నా బీసీ..
నా మైనారిటీలందరూ..
అందరూ కదిలి రండి, వచ్చి తప్పకుండా ఓటు వేయండని జగన్ పిలుపునిచ్చారు.