మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు దశాబ్ద కాలం తర్వాత తల్లి దండ్రులయ్యారు. ఇటీవలె ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. కానీ మూడు నెలల తర్వాత కొణిదెల వారింట్లోకి అడుగుపెట్టింది.
రామ్ చరణ్, ఉపాసన దంపతులు ఇటీవలే తల్లిదండ్రులైన విషయం తెలిసిందే. ఏడాది జూన్ 20న పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది ఉపాసన. పెళ్లైన 11 ఏళ్ల తర్వాత మెగా వారసురాలు పుట్టడంతో మెగాస్టార్ చిరంజీవితో పాటు మెగాభిమానులు తెగ మురిసిపోయారు. ఆ పాపకు క్లిన్ కారా అని నామకరణం చేశారు. ఇక వినాయక చవితి పూజలను క్లిన్ కారాతో కలిసి జరుపుకుంది మెగా ఫ్యామిలీ.
ఈ సందర్భంగా ‘అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు! ఆ విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో జీవితాల్లో విఘ్నాలు తొలగి అందరికీ శుభములు కలగాలని ప్రార్ధిస్తున్నాను! ఈ సారి ప్రత్యేకత… చిన్ని ‘క్లిన్ కారా’తో కలిసి తొలి వినాయక చవితి జరుపుకోవడం.. అని తన ఆనందాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు మెగాస్టార్. ఇదే రోజు క్లిన్ కారా కొణిదెల వారింట్లోకి అడుగుపెట్టింది. హిందూ సంప్రదాయం ప్రకారం.. బిడ్డకు జన్మనిచ్చాక తల్లి తన పుట్టింట్లోనే ఉండాలి. కనీసం మూడు నెలలు పుట్టింట్లో ఉండాలి. ఆ తర్వాతే అత్తింటికి వెళ్లాల్సి ఉంటుంది. ఉపాసన కూడా ఈ సంప్రదాయం ప్రకారం.. తన తల్లితండ్రుల ఇంట్లోనే మూడు నెలలపాటు ఉంది.
ఇక ఇప్పుడు ఆ మూడు నెలలు పూర్తవడంతో.. క్లిన్ కారతో తిరిగి అత్త గారింట్లోకి అడుగుపెట్టింది. తమ వారసురాలు మొదటి సారి ఇంట్లో అడుగుపెడుతుండటంతో.. ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా నిర్వహించారు మెగా ఫ్యామిలీ వారు. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు చిన్న జీయర్ స్వామి ఆశ్రమానికి చెందిన వేదపాఠశాల విద్యార్థులు వేదం మంత్రాల మధ్య క్లిన్ కారాను ఇంట్లోకి అహ్వానించారు. అదే సమయంలో వినాయకుడి విగ్రహాన్ని కూడా కొణిదెల నివాసంలోకి తీసుకువచ్చారు. అందుకే ఈ సారి వినాయక చవితి ప్రత్యేకత.. చిన్ని’క్లిన్ కారా’తో కలిసి జరుపుకోవడం.. అంటూ ఆనందాన్ని పంచుకున్నాడు రామ్ చరణ్.