Salaar: సలార్ ఎఫెక్ట్.. వేరే సినిమాలపై పడుతోందా..?
ప్రఖ్యాత దక్షిణ భారత నిర్మాణ సంస్థ 'హోంబాలే ఫిల్మ్స్' KGF, కాంతారా వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించే కంటెంట్‌ను అందించిన తర్వాత పాన్-ఇండియా ఖ్యాతిని సంపాదించింది. వారి రాబోయే ప్రాజెక్ట్ 'సలార్' పై భారీ అంచనాలు ఉన్నాయి.
ప్రభాస్ నటిస్తోన్న సలార్ చిత్రం సెప్టెంబర్ 28న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కానీ అనుకోని కారణాల వల్ల నిరవధిక వాయిదా పడింది. ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమాపై భారీ బజ్ ఏర్పడింది. సలార్ పై విపరీతంగా హైప్ ఏర్పడింది. ఈ మూవీ నేపథ్యంలో ఇతర భాషల్లోనూ ఇతర సినిమాలు కన్ఫూజన్ లో పడుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ ఈ మూవీ వాయిదా ట్రేడ్ సర్కిల్లకు భారీ షాక్ ఇచ్చింది. ఎందుకంటే సలార్ కారణంగా ఇతర సినిమాలు సరైన తేదీని కోల్పోయాయి.
రెండు నెలల క్రితమే వాయిదా వేసి ఉంటే రాబోయే కొన్ని సినిమాలు ఖాళీగా ఉన్న స్లాట్ లల్లో విడుదలై ఉండేవి. సలార్ టీమ్ వాయిదా సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అధికారిక ప్రకటన కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తుండగా, సలార్ నిర్మాతలు మరోసారి కొత్త విడుదల తేదీని ప్రకటించే పనిలో పడ్డారు. సెప్టెంబర్ 28 నుండి వాయిదా పడిన తర్వాత, ఈ చిత్రం సంక్రాంతి సీజన్ లేదా రిపబ్లిక్ డేకి ప్రేక్షకుల ముందుకు రావచ్చని అంచనాలు ఉన్నాయి. అయితే కొత్త విడుదల తేదీపై ఇంకా నిర్ధారణ లేదు.