టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun)కు అరుదైన గౌరవం దక్కనుంది.లండన్‌లోని ప్రఖ్యాత మేడం తుస్సాడ్స్ మ్యూజియంలో మైనపు బొమ్మ రూపంలో బన్నీ త్వరలో కనిపించానున్నాడు.ఎంతో మంది ప్రముఖుల మైనపు బొమ్మలు లండన్‌లో కొలువై ఉన్నాయి.అక్కడే అల్జు అర్జున్ మైనపు విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయనున్నారన్నది తాజా సమాచారం.ఇందుకు సంబంధించిన సన్నాహకాలు మొదలైనట్టు వార్తలు వినిపిస్తున్నాయి.అల్జు అర్జున్ త్వరలోనే లండన్ మ్యూజియా(London Museum)న్ని సందర్శించడంతోపాటు, మైనపు విగ్రహం రూపొందించడానికి కావాల్సిన తన శరీర కొలతలను ఇవ్వనున్నట్టు తెలుస్తోంది.
దక్షిణాది నుంచి ఇప్పటికే ప్రభాస్(Prabhas), మహేశ్ బాబు మైనపు విగ్రహాలను లండన్ మ్యూజియంలో ఏర్పాటు చేయగా, ఇప్పుడు అల్లు అర్జున్ వారి సరసన చేరిపోనున్నాడు. పుష్ప ది రైజ్’ సినిమాలో పుష్ప రాజ్‌గా ఆయన నటన మాటల్లో చెప్పలేనిది. అప్పటి వరకు బన్నీ స్టార్డం ఒక్క ఎత్తు అయితే.. పుష్ప తర్వాత తన రేంజ్ మరో ఎత్తు. ఈ సినిమాతో బాక్సాఫీస్ బద్దలు కొట్టిన బన్నీ.. ఎన్నో అవార్డులను అందుకుని సత్తా చాటారు. రిసెంట్ గా జాతీయ చలన చిత్ర అవార్డుల్లో ఉత్తమ నటుడి(Best Actor)గా కూడా ఎంపికయ్యారు. ఈ క్రమంలో జాతీయ చలన చిత్ర అవార్డుల చరిత్రలో ఉత్తమ నటుడిగా అవార్డు పొందిన తొలి తెలుగు హీరోగా ఆయన సరికొత్త రికార్డు.