దేశ వ్యాప్తంగా వినాయక చవితి (Vinayaka caviti) వేడుకలు అంగరంగ వైభవంగా జరుతున్నాయి. గణేష్ చతుర్థి వచ్చిందంటే చాలు దేశ వ్యాప్తంగా గల్లీగల్లీలో పండుగ వాతావరణం నెలకొంటుంది. చిన్నారుల నుంచి పెద్దల వరకు గణపతి మండపాలను సిద్దం చేసుకుంటారు. వినాయకున్ని ప్రతిష్టించేందుకు సిద్ధమవుతుంటారు. లంబోదరుని(Lambodara)కి వివిధ రూపాలలో కొలుస్తారు. పుష్పాలు, కరెన్సీలు, డ్రైఫ్రూట్స్, పండ్లు, రుద్రాక్షలు, సుగంధ ద్రవ్యాలు(Spices),కూరగాయాలు ఇలా ఎన్నో రకాలుగా వినాయకుడిని తీర్చి దిద్ది పూజలు చేస్తారు. వినాయక చవితి వచ్చిదంటే చాలు వినూత్న ఆకారాల్లో కొలువైన వినాయకులు సోషల్ మీడియా(Social media)లో తెగ వైరల్ అవుతుంటారు. అటువంటి ఓ వినూత్న గణనాధులు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంటారు.
బెంగళూరు(Bangalore)లోని పుట్టెనహళ్లికి చెందిన జె.పి. నగరంలోని సత్యసాయి గణపతి ఆలయాన్ని నోట్లు, నాణేలతో అలంకరించారు. 2 కోట్లకు పైగా రూపాయల నోట్లు, 50 లక్షలు రూపాయల నాణేలతో వినాయకునికి అలంకరించారు. శ్రీ గణపతి షిర్డీ సాయి ట్రాస్ట్ (Shirdi Sai Trust) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ దేవాలయంలో రూ.5, 10, 20 రూపాయల నాణేలతో పాటు 10, 20, 50, 100, 200, 500 రూపాయిల నోటులతో గణపతిని అలంకరించారు. వీటి విలువ మొత్తం 2.5 కోట్లు కావటం విశేషం. 150మంది భక్తులు నాణాలతో లంబోధురుడ్ని నాణాలతో అలంకరించారు. దీంతో వినాయకుడు విగ్రహ భద్రత కోసం సీసీ కెమెరాల(CC cameras)ను అమర్చారు.అదిగో అటువంటి వినాయకుడే సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాడు.