»Tit For Tat Canadian Diplomat To Leave Bharat Within 5 Days Mea Notices
Tit for tat: కెనడా దౌత్యవేత్త 5 రోజుల్లోగా దేశం వీడాలి
కెనడాలో జరిగిన ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ హత్యతో భారత్(bharat)కు సంబంధముందని అక్కడి ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఈ అంశంపై భారత్ దౌత్యవేత్తను కెనడాలో బహిష్కరించగా..దీనిపై స్పందించిన భారత్ ఇండియాలో కెనడా దౌత్యవేత్తపై కూడా చర్యలు తీసుకున్నారు.
కెనడా చర్యలకు భారత్ ధీటుగా స్పందించింది. ఈ క్రమంలో కెనడా హైకమిషనర్ కెమెరూన్ మాకే కూడా ఐదు రోజుల్లో భారత దేశం విడిచి వెళ్లాలని స్పష్టం చేసింది. ఈ మేరకు భారత ప్రభుత్వం నిర్ణయించిందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) మంగళవారం తెలిపింది. దౌత్యవేత్త వచ్చే 5 రోజుల్లో భారతదేశం విడిచి వెళ్లాలని ఈ మేరకు నోటీసులు కూడా పంపించింది. అయితే భారత ప్రభుత్వానికి, ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్యకు మధ్య సంబంధం ఉందని కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో సోమవారం ఆరోపించారు. ఆ తర్వాత కెనడాలో ఉన్న భారతీయ దౌత్యవేత్తను బహిష్కరించారు. ఈ అంశాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. ఈ నేపథ్యంలో భారత్-కెనడా దేశాల మధ్య సంబంధాలు మరింత దిగజారుతున్నారు.
KTF చీఫ్ హత్య వెనుక భారత ప్రభుత్వ హస్తం ఉందని ట్రూడో అన్నారు. ఢిల్లీలో జరిగిన జీ20 సమ్మిట్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీతో కూడా ఈ అంశాన్ని ప్రస్తావించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ ఏడాది జూన్లో, కెనడాలోని సర్రేలోని గురుద్వారా వెలుపల గుర్తుతెలియని షూటర్లచే నిజ్జర్ హత్య చేయబడ్డాడు. గత కొన్ని వారాలుగా కెనడియన్ భద్రతా ఏజెన్సీలు కెనడియన్ పౌరుడు హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్యకు భారత ప్రభుత్వం మధ్య సంబంధం ఉందని ఆరోపణలు చేస్తున్నాయి. మరోవైపు ఈ అంశంపై కెనడాలోని ఖలిస్తానీ ఉగ్రవాదులు, తీవ్రవాదుల నుంచి దృష్టిని మరల్చడానికి ఇలా ఆరోపణలు చేస్తున్నారని MEA అంటోంది. కెనడాలో హత్యలు, మానవ అక్రమ రవాణా, వ్యవస్థీకృత నేరాల వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలు కొత్త కాదని స్పష్టం చేసింది.